దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. ఒక్కసారిగా 4 వేలు దాటిన కేసులు!

  • గత 24 గంటల్లో కొత్తగా 4,041 కేసుల నమోదు
  • కరోనా కారణంగా 10 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,177
మన దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రోజువారీ కేసులు ఒక్కసారిగా 4 వేలను దాటడం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,041 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,363 మంది కోలుకోగా... 10 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 21,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,26,22,757 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 5,24,651 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 1,93,83,72,365 వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 12,05,840 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.



India
Corona Virus
Updates

More Telugu News